హైదరాబాద్ DME గారికి వినతిపత్రం ఇచ్చిన హాస్పిటల్ citu యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ ,వైస్ ప్రెసిడెంట్ ఎస్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు నెలలుగా ప్రభుత్వ హాస్పిటల్స్ లోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ జీవో 60 ప్రకారం వేతనాలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ కార్మికులను చిన్నచూపు చూస్తూ 9000 ఇస్తున్నారని కాంట్రాక్టు తో న్యూ అగ్రిమెంట్ చేసుకోకుండా పాత కాంట్రాక్ట్ తోనే పాత అగ్రిమెంట్ తోనే నడిపిస్తు కార్మికులను మోసం చేస్తున్నారు. దీనివల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ధరలు పెరిగి ఇంటి కిరాయిలు కట్టుకోలేక పిల్లల ఫీజులు భారమైనయి కావున వెంటనే డిఎంఏ గారు స్పందించి న్యూ అగ్రిమెంట్ చేసుకొని 15600 జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జనవరి 17 నుంచి నిరసన ప్రోగ్రాం యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో చెస్ట్ హాస్పిటల్ ముందు చేస్తాం కాబట్టి వెంటనే స్పందించి జీతాలు పెంచాలని వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది.