ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ తాటికొండ గ్రామములో
శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తాటికొండ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు ప్రదర్శించిన పలు గణిత నమూనాలు ఆకర్షణగా నిలిచాయి.విద్యార్థులందరూ ఉదయం నుంచి ఉత్సాహంగా గణిత వేడుకలో పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు గణిత క్విజ్ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిచ్చి గణిత నమూనాలను రూపొందించడంలో సహాయం అందించిన గణిత ఉపాధ్యాయులు రుద్ర,రంజిత్ కుమార్ అనసూయ ను ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు అభినందించారు.ఉత్తమ గణిత మోడల్స్ తయారుచేసిన విద్యార్థులకు బహుమతి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్,సలావుద్దీన్, పిడి.గిరెడ్డి ప్రమోద్ రెడ్డి,సోమేశ్వరి,జగదీష్,రవి తదితరులు పాల్గొన్నారు