నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలో వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరుతో శృతి వనం ఐదెకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేష్ అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం లో చాకలి ఐలమ్మ స్మారక భవనం ముందు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం 2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం సమావేశానికి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు చిట్యాల సమ్మయ్య అధ్యక్షత వహించగా. నరేష్ పాల్గొని మాట్లాడుతూ నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం పోరాటం కొనసాగిస్తున్న రజకులకు ప్రభుత్వం రజకులు దిమగ బతికేలా కృషి చేయాలన్నారు. రజకులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వృత్తి పనిని చేస్తున్నారని అనేకమంది చెరువులు, కుంటల వద్ద వృత్తి పని చేస్తున్నారని ప్రమాదాలు జరిగితే వారి భద్రత కోసం రూపాయలు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రజకులకు స్వయం ఉపాధి కోసం విద్యుత్ ఇస్తీ పెట్టెలను లను ఇవ్వాలని ఉచిత విద్యుత్ పథకాన్ని ఎల్టి 2 నుండి 4 కుమార్చాలన్నారు. 50 ఏళ్లు నిండిన రజకులకు పించిని 3000 రూపాయలు ఇవ్వాలని సామాజిక రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో రజకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని. ప్రభుత్వ దావకానలో. విద్యాసంస్థల్లో. హాస్టల్లో. దేవాలయాల్లో రజకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ల సాధన కోసంఉద్యమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మండల ఉపాధ్యక్షులు జ్యోతి యాదగిరి, సహాయ కార్యదర్శి వేముల రాములు, కోశాధికారి పోలాస సోమయ్య, సభ్యులు చిట్యాల మధు, చిట్యాల సురేష్, జ్యోతి అంజయ్య, ఏలూరు వేణు, కొన్నె యాకయ్య తదితరులు పాల్గొన్నారు.