మేడారం జాతరకు బస్సుల ఏర్పాటు
మహబూబాబాద్ డిపో నుండి దేశంలోని అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగినది. మహబూబాబాద్ డిపో నుండి ప్రతిరోజు మేడారం జాతరకు ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు నడపబడునని ఆర్టీసీ బస్సులు సమ్మక్క సారక్క దేవతల గద్దెల దగ్గరకు వెళ్ళునని, ఇట్టి అవకాశాన్ని మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ప్రయాణికులు మరియు ప్రజలు సద్వినియోగపర్చుకోవాలని ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం సుఖవంతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవదర్శనం చేసుకొని రావచ్చునని డిపో మేనేజర్ వి. కళ్యాణి ఒక ప్రకటనలో తెలియజేసినారు