జాతీయ స్థాయి వాటర్ పోలోకు ఎం.ఎ.రెహమాన్ ఎంపిక
సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోకాస్ శ్రీ వాణి హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్ జాతీయ స్థాయి వాటర్ పోలో పోటీలకు ఎంపికై జిల్లా కీర్తిని చాటాడు.ఇటీవల ఆదిలాబాద్లో నిర్వహించిన 10వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయి ఈతల పోటీలు-2025లో భాగంగా జరిగిన వాటర్ పోలో ఎంపికల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రెహమాన్ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు.ఈ ఎంపికల్లో ఉత్తీర్ణులైన క్రీడాకారులు ఈ నెల 27,28,29 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని అక్వేటిక్ కాంప్లెక్స్,బాలయోగి స్టేడియంలో జరగనున్న 36వ సౌత్ జోన్ అక్వాటిక్ ఛాంపియన్షిప్-2025 జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.ఉమేష్ తెలిపారు.సంగారెడ్డి జిల్లా నుండి వాటర్ పోలో బాలల విభాగంలో అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్,బాలికల విభాగంలో ఆలియా ఫాతిమా ఎంపికైనట్టు జిల్లా స్విమ్మింగ్ ఇంచార్జ్,పీడీ శేషు కుమార్ వెల్లడించారు.జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు సంగారెడ్డి జిల్లా డివైఎస్ఓ ఖాసిమ్ బేగ్ అభినందనలు తెలియజేసి,భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.