ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు ఏర్పాట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు మేడారం మహాజాతర సందర్భంగా జిల్లా ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కల్పించేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ భూపాలపల్లి డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ముందుగానే ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీమతి ఎ. ఇందు తెలిపారు.ఈ మేరకు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రెస్ రిపోర్టర్లతో సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.భూపాలపల్లి డిపో నుంచి మేడారం వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఈ బస్సులు భూపాలపల్లి నుంచి చెల్పూర్, ఘనపూర్, ములుగు, గోవిందరావుపేట, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం వరకు ప్రయాణిస్తాయని వివరించారు.
భూపాలపల్లి నుంచి మేడారం బస్సు సమయాలు
ఉదయం 8:00, 9:00 గంటలకు
సాయంత్రం 4:10, 5:10 గంటలకు
మేడారం నుంచి భూపాలపల్లి బస్సు సమయాలు
ఉదయం 10:40, 11:40 గంటలకు
సాయంత్రం 6:45, 7:45 గంటలకు
ఈ ప్రత్యేక బస్సు సర్వీసులపై మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని తెలిపారు.భక్తుల రద్దీని బట్టి అవసరమైతే అదనపు ట్రిప్పులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలను భూపాలపల్లి డిపో మేనేజర్ శ్రీమతి ఎ.ఇందు కోరారు.