మొదటి సంవత్సర విద్యార్థుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు
కొత్తగూడెం, జనవరి01 :
మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ, కొత్తగూడెం ప్రాంగణంలో మొదటి సంవత్సర విద్యార్థుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్శిటీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరం విద్యార్థులకు విజ్ఞాన ప్రగతి, పరిశోధనాభివృద్ధి, నైతిక విలువలతో కూడిన జీవన మార్గాన్ని అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకొని దేశాభివృద్ధికి తోడ్పడేలా ముందుకు సాగాలని సూచించారు. వేడుకలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కొత్త సంవత్సరాన్ని సంతోషం, స్నేహభావం, ఐక్యతతో ఆహ్వానిస్తూ యూనివర్శిటీ ప్రాంగణం ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు, అధ్యాపకులు డా.రాజేశ్వరి, పిడి కృష్ణ, డా. కిషోర్ కుమార్, డా. రాములు, లావణ్య, విద్యార్థులు కాళంగి హరికృష్ణ, క్రాంతి, భానుప్రకాష్, లిఖిత, శరణ్య తదితరులు పాల్గొన్నారు.