మూలమర్రి తండ లో చీరలు పంపిణీ
మరిపెడ మండల కేంద్రం లోని ఉమ్మడి తనంచెర్ల గ్రామ పంచాయతీ ములమర్రి తండా పరిధిలో చీరల పంపిణీలో స్థానిక గ్రామ సర్పంచ్ భూక్య జానకి రాములు నాయక్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం చేశారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తండ లోని 20 మహిళ సంఘం సభ్యులకు 221 చీరలు పంపిణీ చెయ్యడం జరిగినది అన్నారు,ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారీ పెట్టి గౌరవించాలని ఉద్దేశంతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు, స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర ఇస్తున్నామని తెలియజేశారు.
అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,10 లక్షల ఆరోగ్య శ్రీ, 500 లకే సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, 500 బోనాస్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో తేజావత్ నెహ్రూ నాయక్,భూక్యా వెంకన్న నాయక్,వంకుడోతూ రవి,భరత్ నాయక్,సీత్యా,భూక్యా వీరన్న, ఉప సర్పంచ్ కిషన్ నాయక్,వార్డు సభ్యులు హరి సింగ్,అరుణ,సోమాని,నీలమ్మ, సోమ్లి,సునీత,గ్రామ కార్యదర్శి ప్రణయ్, సిసి చందు,సిఏ పద్మ తదితరులు పాల్గొన్నారు.