కార్యకర్తలే కాంగ్రెస్ కు బలం ఎంపీ డా.కడియం కావ్య
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ..వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని మరింత పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం కాదు,ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే సిద్ధాంతబద్ధమైన పార్టీ అని స్పష్టం చేశారు.నియోజకవర్గంలోని ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని తెలిపారు.ఐక్యతతో ముందుకు సాగితేనే పార్టీ మరింత బలపడుతుందన్నారు.అలాగే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారని డా.కడియం కావ్య ప్రశంసించారు.కాజీపేట బ్రిడ్జి,నాలా సమస్యల పరిష్కారం,వరద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అనేక కీలక పనులను విజయవంతంగా చేపట్టారని పేర్కొన్నారు.అవినీతి రహిత పాలనతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ నాయకులు అరాచక రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అజెండా పూర్తిగా అభివృద్ధి,ప్రజా సంక్షేమమేనని స్పష్టం చేస్తూ,రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డివిజన్ పర్యటనలను విజయవంతం చేసి పార్టీ బలాన్ని మరింత పెంచాలని సూచించారు.అనంతరం నేడు ప్రియాంక గాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు ఎంపీ డా.కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.దేశ రాజకీయాల్లో ప్రజల సమస్యలపై నిలబడి పోరాడుతున్న నాయకురాలిగా ఆమె సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.