తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో,రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో భూపాలపల్లి టౌన్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదినం (జనవరి 17)ను పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.శుక్రవారం భూపాలపల్లిలో రవి పటేల్ నివాసం వద్ద నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో టీఆర్పీ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువతతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా రక్తదానం ద్వారా అనేకమంది ప్రాణాలు కాపాడబడాలని పాల్గొన్నవారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయురారోగ్యాలతో ఉండాలని,తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం మరింతగా పోరాడాలని ఆకాంక్షలు వ్యక్తం చేశారు.సమాజ సేవే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న చేపడుతున్న కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, భూపాలపల్లిలో ప్రతి సంవత్సరం తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందన్నారు.రక్తదానం అత్యంత గొప్ప దానం అని, దీనివల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రాణ రక్షణ లభిస్తుందని తెలిపారు.ఎలాంటి అవసరం వచ్చినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.రాబోయే రోజుల్లో టీఆర్పీ పార్టీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్య నిరంతరం ఉంటామని తెలిపారు.అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని తీన్మార్ మల్లన్న ఎప్పుడూ పార్టీ శ్రేణులకు ప్రేరణనిస్తూ ఉంటారని చెప్పారు.అలాగే భవిష్యత్తులో భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరింత బలోపేతం చేస్తూ గడపగడపకు సేవా కార్యక్రమాలు చేపడతామని,2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చి తీన్మార్ మల్లన్న బహుజనుల పక్షాన ముఖ్యమంత్రిగా పరిపాలన చేపడతారని రవి పటేల్ ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ నాయకులు ఎస్పీకే సాగర్, ఇనుగాల ప్రణయ్ రాజ్, పిట్టల వెంకటేష్, గంధం సతీష్, జినుకల శ్రీను, మడే సంతోష్, రొడ్డ శ్రీనివాస్, మేనం సంతోష్, పింగిడి శంకరయ్య, నవీన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.తీన్మార్ మల్లన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమానికి విశేష మద్దతు తెలిపారు.