రూ.18 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.7 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని,ఈరోజు మరో రూ.18 కోట్ల పనులకు శంకుస్థాపన చేసి మొత్తం రూ.25 కోట్ల పనులు చేపట్టామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.నెల రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేలా అధికారులు,కాంట్రాక్టర్లు పనిచేయాలని ఆదేశించారు.త్వరలో మున్సిపల్ కార్యాలయ భవనం,టౌన్ హాల్,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి పనులు కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య,ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి చాగల్,శివునిపల్లి,స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీలు,వరద కాలువలు,డివైడర్లు,సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి మొత్తం రూ.18 కోట్ల వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ,అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్,మున్సిపల్ అధికారులు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.