జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు
ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు
పనులన్నీ జనవరి 25వరకు పూర్తి చేయాలి
అధికారులు,నిర్వాహకులు జాతరను విజయవంతంగా పూర్తి చేయాలి సమ్మక్క సారలమ్మల మినీ జాతరల పనులన్నీ జనవరి 25 వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను,జాతర కమిటీలను మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు.స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం మరియు చిల్పూర్ మండల కేంద్రంలోని మినీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా జాతరలో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా త్రాగు నీరు,విద్యుత్,టాయిలెట్స్,పారిశుధ్యం,రోడ్లు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మేడారానికి 250కోట్లతో కొత్త శోభను తీసుకువచ్చిందని,నూతనంగా సమ్మక్క,సారలమ్మల గద్దెల నిర్మాణం,ద్వార తోరణాల నిర్మాణంతో ఆదివాసీలకు సంబంధించిన చరిత్ర వాళ్ళ సంస్కృతి ప్రజలందరికీ తెలిసే విధంగా నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు.ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.అయితే చాలా మంది భక్తులు మేడారం వెళ్ళలేకపోతున్నారు,కాబట్టి వారి వారి గ్రామాలలోనే సమ్మక్క సారలమ్మ గద్దెలను నిర్మించుకొని తల్లులను ప్రతిష్టించుకొని పూజలు చేసుకుంటున్నారని తెలిపారు.మన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 గ్రామాలలో ఈ సమ్మక్క సారలమ్మ జాతరలు జరుగుతున్నాయని,కొండాపూర్ శ్రీపతిపల్లి,లింగంపల్లి,గార్లగడ్డ తండా,చిల్పూర్,జిట్టేగూడెం,ఇప్పగూడెం ఈ గ్రామాల్లో కూడా 28,29,30,31 తేదీలలో మినీ జాతరలు జరుగుతున్నాయని ఇక్కడికి కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిపారు.ఈ మినీ జాతరలలో భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం ద్వారా,ఎంపీ ద్వారా,కలెక్టర్ ద్వారా మొత్తం 89లక్షల 50వేలతో మినీ జాతరలలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.జాతరలో చేపడుతున్న పనులన్నీ కూడా ఎట్టి పరిస్థితులలో 26 జనవరి లోపల పూర్తి చేయాలని అధికారులను,జాతర కమిటీలను ఆదేశించారు.ఇప్పగూడెంలో తల్లుల గద్దెల దగ్గర ప్లాట్ ఫామ్ ని పెంచవలసిన అవసరం ఉన్నదని అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబందిత అధికారులకు సూచించారు.అలాగే ఇక్కడ రెండు రూముల భవనం మరియు టాయిలెట్స్ చేసి దానికి నీటి సరఫరా ఉండే విధంగా నిర్మాణం చేయాలని అన్నారు.దీంతో పాటు గద్దెల నుండి కోమటిగూడెం వరకు బిటీ రోడ్డు చేయాలని ఈ పనులను వచ్చే జాతర సమయానికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.చిల్పూర్ జాతరలో 26లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.జాతర పరిసరాలలో వీలైనన్ని ఎక్కువ లైట్లు పెట్టాలని సూచించారు.వచ్చే జాతరలపు గద్దెల చుట్టు సిసి ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు,అలాగే జాతర ప్రాంతంలో శాశ్వత భవనం టాయిలెట్స్ నిర్మాణంతో పాటు రోడ్డు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు.జాతరల వద్ద ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు,ఆర్డివో వెంకన్న,పంచాయతీ రాజ్,విద్యుత్,గ్రామీణ నీటి సరఫరా,దేవాదాయ,రెవిన్యూ,పోలీస్ శాఖల అధికారులు,జాతర కమిటీల చైర్మన్లు,డైరెక్టర్లు,సర్పంచులు,స్థానిక నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.