అదిరే కలెక్షన్స్.. ఆకట్టుకునే వెరైటీస్..
- అట్టహాసంగా పిఎంజె గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్
- ప్రారంభమైన రెండు రోజుల ప్రత్యేక అమ్మకాలు
- 5వేల నుంచి 20లక్షల వరకు అందుబాటులో ఆభరణాలు
- సొంత తయారీతో కొత్తగూడెం మగువలు మెచ్చేలా డిజైన్స్..
- ప్రారంభించిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దారా రమేష్
- బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..!! బంగారు నగలుతో అలంకరించుకోవాలని ప్రతి ఆడవారికీ ఉంటుంది..!! అలాంటి వారి కోరికను నెరవేర్చేందుకు అదిరే కలెక్షన్స్.. ఆకట్టుకునే వెరైటీస్‌తో పిఎంజె గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి కొత్తగూడెం ప్రాంత ప్రజల మనసు దోచేస్తోంది. 5 వేల నుంచి 20లక్షల వరకు బంగారు ఆభరణాలను అందుబాటులో ఉంచి ఔరా అనిపించింది.!! 60 ఏండ్లుగా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ జ్యూయలరీ సంస్థ పిఎంజె గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కొత్తగూడెం పట్టణంలో ఏర్పాటు చేయడం పట్ల పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి పరిధిలోని కమ్మ సత్రం నందు పిఎంజె గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ప్రత్యేక గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రదర్శన, అమ్మకాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దారా రమేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను నమ్మకంతో అందించే సంస్థలే మార్కెట్లో నిలదొక్కుకుంటాయని పేర్కొన్నారు.
- ఈ కార్యక్రమంలో పిఎంజె ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, తెలంగాణ సేల్స్ హెడ్ మధవ్తో పాటు సంస్థ యాజమాన్యం పాల్గొన్నారు. అతి త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పిఎంజె జ్యూయలరీ సంస్థను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులకు ప్రత్యేక సేవింగ్స్ ప్లాన్ సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో రూ.5,000 నుండి రూ.20 లక్షల వరకు గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాల విస్తృత కలెక్షన్లు ప్రదర్శించగా, రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వెడ్డింగ్ కలెక్షన్లు మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న ఉంగరం నుంచి పెద్దవారు ధరించే సంప్రదాయ బంగారు నగల వరకు అన్ని రకాల డిజైన్లు అందుబాటులో ఉంచారు. అలాగే డైమండ్ జ్యూయలరీ విభాగంలో ముక్కుపుడక నుంచి వడ్డాణం వరకు ఆధునిక, సంప్రదాయ శైలిల్లో ప్రత్యేక కలెక్షన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శన నేటితో ముగియనున్నది. ఈ కార్యక్రమంలో పి.సత్యనారాయణ, మాదా శ్రీనివాస్, ముడతనపల్లి శ్రీనివాసరావు, ఏ.వీరస్వామి, పి.గోపీకృష్ణ, పసుమర్తి అనంతం తదితరులు పాల్గొన్నారు.