తెలుగు గళం దినపత్రిక' క్యాలెండర్ ఆవిష్కరించిన గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్
తెలుగు గళం దినపత్రిక 2026 సంవత్సర క్యాలెండర్ ను శనివారం మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అవిష్కరించారు. ఈ సందర్భంగా నవీన్ రావు మాట్లాడుతూ.. గొప్ప అవిష్కరణల ద్వారా గొప్ప గొప్ప ఫలితాలు పొందగలుగుతారని తెలియచేసారు,వినూత్నమైన అవిష్కరణలు ద్వారా పొందిన మంచి ఫలితాలను సాధారణ ప్రజలకు సైతం అందుబాటులో వుండే విదంగా వున్నప్పుడే వాటికీ ఒక అర్థం, పరమార్థం ఉంటుందని అలాంటి వినూత్నమైన అవిష్కరణ యొక్క ఫలితం సార్థకం అవుతుందని తెలియాచేసారు. అదేక్రమంలో తెలుగు గళం దినపత్రిక ప్రజా సమస్యలపై మరిన్ని వార్త కథనాలు రాసి ప్రభుత్వాలకు ప్రజలకు వారదిగా ఉండాలని తద్వారా సమాజానికి మేలు జరిగేవిదంగా వార్తలను అందిస్తూ ముందుకు సాగాలని సూచన చేశారు, నవీన్ రావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందకరంగా ఉందని తెలుగు గళం దినపత్రిక యాజమాన్యం సంతోషంన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ స్ నాయకులు గంట్ల మహిపాల్ రెడ్డి,పేపర్ శ్రీను,బోడ భాస్కర్, లునవత్ వెంకన్న,తదితరులు పాల్గొన్నారు