ఇసుక పర్మిట్ ఆంధ్రాకు దిగుమతి తెలంగాణ లో
ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నారు.వీరికి ఇరు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల పెద్దల అండ పుష్కలంగా ఉందని వినికిడి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కామవరపుకోట గ్రామానికి ఓ రైతుకు ఇంటి నిర్మాణం కొరకు అంటూ తప్పుడు సమాచారం ఇచ్చి ఇసుక దిగుమతి కొరకు ఆంధ్రా అధికారులకు ముడుపులు ఇచ్చి పర్మిట్ లు తీసుకుంటూ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రంలో గల వేంసూరు,పెనుబల్లి,కల్లూరు మండలాలకి యదేచ్ఛగా మాఫియా డాన్ లు ఇసుక తరలిస్తున్నారు.అసలు విషయం ఏమిటంటే వీరి టార్గెట్ తెలంగాణ లో ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు మూడింతల అదనపు ధరకు ఇసుక అమ్ముకోవడం వీరి ప్రవృత్తి. ఆంధ్రా డాన్ లకు ఈ మండలాలో చిన్న డాన్ లు గుమస్తాలుగా వ్యవహరిస్తూ లక్షల రూపాయల అదనపు సొమ్ము ను పేద ప్రజల నుండి రాబడుతున్నారు.ఇదంతా అధికారులకు తెలిసినా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.ఆదివారం తెల్లవారుజామున ఓ పత్రికా ప్రతినిధి అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న విషయాన్ని పసిగట్టి అట్టి ఇసుక లారీ ను(ఏపీ07టిజె 2547) వేoసూరు మండల సమీపంలో నిలుపుదల చేయగా డ్రైవర్ తనది పట్వారీగూడెం నివాసమని ఇసుక లారీ వేంసూరు కు చెందిన అభిషేక్ దని వాహనానికి చెందిన సి.బుక్ మాత్రం ఆంధ్రాకు చెందిన వ్యక్తి పేరుతో ఉందని తెలపడం జరిగింది.అట్టి వాహనాన్ని ఆ పత్రికా ప్రతినిధి పోలీసులకు సమాచారం అందించి అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం.అట్టి ఇసుక లారీ కు ఎస్కార్ట్ గా ఓ కారు(ఏపీ 16 సి ఎల్ 1881) కూడా ఉన్నట్లు తెలుస్తోంది.