బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఖమ్మంజిల్లా కార్యాలయం వద్ద 2026 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి హాజరై నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు.అనంతరం జరిగిన సభలో ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పులు చేశి దుర్మార్గమైన లేబర్ కోడ్ ల ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కోడ్ ల ను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి చేసే సమ్మె లో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో: జిల్లా అధ్యక్షుడు దోనోజు లక్ష్మయ్య, మేడికొండ నాగేశ్వరరావు, టి వి రమణ, యర్రా మల్లికార్జున్, బోయినపల్లి వీరబాబు, బెల్లంకొండ లింగయ్య, చిలుకూరి వీరాస్వామి, వెన్నబోయిన వెంకటేశ్వర్లు, బావ్ సింగ్, కొట్టే చిన్నా, సారంగి రమణ తదితరులు పాల్గొన్నారు.