పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే
కాలనీ వాసుల సమస్య అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు వంశరాజుల కాలనీకి చెందిన బండారి రాజు అనారోగ్యంతో మృతి చెందిరి,వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మృతుడి భౌతిక దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో తాము ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు..అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నాగరాజు గారు, కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, మాజీ జడ్పీటీసీ బానోతు సింగిలాల్, కాంగ్రెస్ నాయకులు చిటూరి అశోక్, అంబేద్కర్ నగర్ సర్పంచ్ చిటూరి రాజు,స్థానిక నాయకులు యాకయ్య తదితరులతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.