ఈ69న్యూస్ ఎర్రగడ్డ ఫిబ్రవరి 01 ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో కార్మికులకు జీవో 60 ప్రకారం 15,600 ఇవ్వాలని హాస్పిటల్ ముందు రిలే నిరాహార దీక్ష చేయనున్నామని సిఐటియు యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్ సూపర్డెంట్ మహబూబ్ ఖాన్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ కు జీవో 60 అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం,ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ కార్మికులకు మాత్రమే అమలు చేయడం లేదని వెంటనే ఈ జీవో అమలు చేయాలని ఫిబ్రవరి 2,3 తేదీలలో నిరసన ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి నస్రిన్, విటల్ తదితరులు పాల్గొన్నారు.