
ఈరోజు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ బసవరాజ్ సారయ్య గారిని కలిసిన సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రజకులకు 1000/-వెయ్యి కోట్లు కేటాయించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ బృందం వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.అందులో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మడి రాజు నరేష్, పైళ్ళ ఆశయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి ఉపేందర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి ఏం గోపాల్, మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు సుభద్ర, సౌత్ జిల్లా అధ్యక్షులు రాములు, తదితరులు పాల్గొన్నారు.