
డి వైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్….
👉 ఫిబ్రవరి 11న మధిర పట్టణంలో యంగ్ వుమెన్ రాష్ట్ర కన్వెన్షన్ సందర్భంగా జరిగే ర్యాలీని, సెమినార్ ను జయప్రదం చేయగలరు ÷ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్….
👉 ఫిబ్రవరి 11న, మధిర పట్టణంలో జరిగే ర్యాలీ, సెమినార్, యంగ్ వుమెన్ కన్వెన్షన్ రానున్నరాష్ట్ర, అఖిల భారత నాయకత్వం…..
ఖమ్మం, ఫిబ్రవరి 3,2023….
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ( డివైఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర యంగ్ ఉమెన్ కన్వెన్షన్ ఈనెల 11వ తారీఖున మధిర పట్టణంలో జరగబోతుందని, ఈ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ యువతులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
స్థానిక సుందరయ్య భవనంలో జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అధ్యక్షుడు జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11 వ తారీఖున పట్టణంలో యంగ్ ఉమెన్ రాష్ట్ర కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు, ఈ కన్వెన్షన్ కు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది యంగ్ ఉమెన్ హాజరవుతున్నట్లు, ఈ సందర్భంగా జరిగే సెమినార్లు, ర్యాలీ లను జయప్రదం చేయాలని ఆయన యువతులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు…
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ మొదటిసారి ఖమ్మం జిల్లా మధిర పట్నంలో ఈ యంగ్ ఉమెన్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు ఈనెల 5వ తారీఖున పట్టణం యుటిఎఫ్ ఆఫీసులో కన్వెన్షన్ జయప్రదానికి ఆహ్వాన సంఘం వేయనున్నట్లు ఆయన తెలియజేశారు. పెద్దలు యువతీ యువకులు అందరూ కూడా ఈ కన్వెన్షన్ జయప్రదని సహకరించాలని, కార్యకర్తలు ఈ కన్వెన్షన్ జయప్రద కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కన్వెన్షన్ కు రాష్ట్ర ఆలిండియా నాయకత్వం వస్తుందని ఆయన సందర్భంగా తెలియజేశారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సత్తెనపల్లి నరేష్, పటాన్ రోషిని కాన్, చింతల రమేష్, శీలం వీరబాబు, పదముత్తము ఉష,కూరపాటి శ్రీను, గుమ్మ ముత్తారవ్, దిండు మంగపతి,సుజాత,కనపర్తి గిరి,రామిశెట్టి సురేష్,తదితరులు పాల్గొన్నారు….
ఇట్లు