
జనగామRDOమధుమోహన్
జనగామ : సిపిఎం పార్టీ జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎసి రెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని జనగామ RDO సిహెచ్ మధుమోహన్ అన్నారు. శుక్రవారం రోజున పట్టణంలోని ఎల్లంల రోడ్డు ఎసి రెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ కాలనీలో సిపిఎం జనగామ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో RVM హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ రెవిన్యూ డివిజనల్ అధికారి(RDO) సిహెచ్ మధుమోహన్ గారు జనగామ CI ఏ శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిపిఎం టౌన్ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించగా RDO మధుమోహన్ గారు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరోనా లాంటి అనేక కొత్త కొత్త వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వేలకు వేలు పెట్టి ప్రైవేట్ వైద్యాన్ని చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని అలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.RVM ఆసుపత్రి వారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను జనగామ ప్రాంత ప్రజలకు మరింత విస్తృత పర్చాలని వారు కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాల దృష్టిలో పెట్టుకొని వైద రంగానికి ఎక్కువ నిధులు బడ్జెట్లో కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, cpm జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, డాక్టర్లు. పట్టణ కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత బాల్న వెంకట మల్లయ్య కళ్యాణం లింగం నాయకులు తూడి దేవదానం బూడిది అంజమ్మ శాఖ కార్యదర్శిలు చీర రజిత కొండ వరలక్ష్మి వడ్డేపల్లి బ్లెస్సింగ్ టన్ రాగల అంజయ్య చీర శీను బూడిది సంపత్ మంతపురి మధు మేడ ఆనందం కళ్లెం కుమార్ మేడ నరసింహులు ప్రజ్ఞాపురం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు