మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు 5వేల కోట్లకు పెంచాలి,
Hyderabadబడ్జెట్ సబ్ ప్లాన్ హామీ నిలబెట్టుకోవాలి.
ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ బడ్జెట్ 5వేల కోట్లకు పెంచాలని, గతంలో కేసిఆర్ హామీ ఇచ్చిన విధంగా బడ్జెట్ సబ్ ప్లాన్ అమలు చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల,90వేలకోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి మైనారిటీ సంక్షేమానికి కేవలం 2,200 కోట్లు మాత్రమే కేటాయించడం సరైనది కాదని అన్నారు. గత బడ్జెట్ లో కేటాయించిన 1702 కోట్లు కూడ పూర్తిగా ఖర్చు చేయలేదని, ఈ బడ్జెట్లో కేటాయింపులు పెద్దగా పెంచింది లేదని విమర్శించారు. మైనారిటీల సంక్షేమానికి కనీసం 5 వేలకోట్లు కేటాయించి అందులో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు 2000 కోట్లు విడుదల చేసి నిరుద్యోగులకు, స్ట్రీట్ వెండార్స్ కు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి, మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని, గత బడ్జెట్ లో 5020 కోట్లు కేటాయించిన
కేంద్ర ప్రభుత్వం, 2600 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, తాను కేటాయించిన నిధులు తానే ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేసి, గతంలో కేటాయించిన నిధులు ఖర్చు కాలేదని ఈ బడ్జెట్లో మొత్తం కేటాయింపులు సగానికి తగ్గించింది. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 45 లక్షల కోట్ల బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 3079 కోట్లు కేటాయించి దారుణంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం చేేసిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమైనా గుర్తించి ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని అబ్బాస్ డిమాండ్ చేశారు. వక్ఫ్ భూములు రక్షణకు, ఉర్దూ భాష అభివృద్ధికి కేటాయింపులు పెంచాలని కోరారు. కేంద్రం మైనారిటీ విద్యార్థులకు ఫ్రీమెట్రక్ స్కాలర్షిప్స్ లేకుండా చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ నిధులు పెంచి, పేద మైనారిటీ విద్యార్థులను ఆదుకోవాలని కోరారు.