
ఫిబ్రవరి-12 నుంచి మూడు రోజుల పాటు బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో జరిగే జూనియర్స్ జాతీయ స్థాయి పోటీల్లో 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గోనబోతున్న రఘునాథ్ పల్లీ మండలం వెల్ది గ్రామానికి చెందిన కళ్లెం నవీన్ అనే యువకునికి కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఉపముఖ్యమంత్రి,ఎం.ఎల్.సి కడియం శ్రీహరి గారు చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో కడియం యువసేన నాయకులు కడియం యువసేన అధ్వర్యంలో ప్రోత్సాహకంగా యువకునికి సుమారు 10000/- రూపాయల విలువగల స్పోర్ట్స్ షూస్,డ్రెస్ కోసం ఆర్థిక సహకారం అందించారు..
ఈ కార్యక్రమంలో కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎలమకంటి నాగరాజు గారు,కడియం యువసేన నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎండీ.హాఫిజ్ గారు,జాఫర్ ఘడ్ మండల అధ్యక్షులు యాట అశోక్ గారు,చిల్పూర్ మండల అధ్యక్షులు ఇల్లందుల విజయ్ గారు, ఘనపూర్ మండల కడియం యువసేన సోషల్ మీడియా ఇంఛార్జ్ మేకల శ్రీకాంత్ గారు,కడియం యువసేన మండల నాయకులు సౌదరపల్లీ సంపత్ రాజ్ గారు పల్గొన్నారు.