69 news వెంగళరావు నగర్ ఫిబ్రవరి 06 ఇండ్లు లేని కార్మికులందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, రేకుల రూమ్ ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి 5లక్షలు ఇవ్వాలని కరపత్రాన్ని రిలీజ్ చేసిన కార్మిక నాయకులు,చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కావున ఈనెల 9న కార్మికులందరూ ఉదయం 10 గంటల వరకు ఇందిరాపార్క్ చేరుకోవాలని సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కమిటీ సభ్యులు రాపర్తి అశోక్ కార్మికుల ఉద్దేశించి మాట్లాడి కరపత్రాన్ని రిలీజ్ చేశారు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికులకు ఇల్లు గానీ,ఇళ్ల స్థలాలు గాని ఇవ్వలేదని వెంటనే ఇల్లు లేని కార్మికులందరికీ ఇళ్ల, స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సక్కుబాయి,సరస్వతి,ప్రభావతి,శశికళ,నవనీత,పద్మశ్రీ ,తదితరులు పాల్గొన్నారు.