
E69 news జఫర్ఘడ్ ఫిబ్రవరి 06
హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ఆదివారం రోజు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ పోటీలో జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి,తమ్మడపల్లి(జి) గ్రామానికి చెందిన రాపర్తి నవీన్ కుమారుడు రాపర్తి సాత్విక్ అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించి విజయం సాధించి జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ అవార్డు గెలుపొందాడు.సాత్విక్ సినీస్టార్ సుమన్ చేతుల మీదుగా ప్రశంస పత్రంతో పాటు అవార్డు పొందాడు.ఈ సందర్భంగా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నెపు రాజేంద్రం,జిల్లా అధ్యక్షురాలు గుజ్జరి స్వరూప రాజు, మరియు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు సాత్విక్ ను అభినందించారు.మరిన్ని విజయాలు సాధించి స్కూల్ కు గ్రామాని మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.