
తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలి,రుణమాఫీలకు సరిపడా బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య పేర్కొన్నారు.శుక్రవారం జఫర్గడ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సోమయ్య మాట్లాడుతూ 2023-24 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.26,831 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ వ్యయ వాల్యూమ్ -2లో వ్యవసాయానికి రూ.20,890 కోట్లు మాత్రమే కేటాయించబడ్డాయి. ఆర్థిక మంత్రి చెప్పిన పద్దు పరిశీలించిన అందులో రైతుల రుణ మాఫీకి రూ.6,385 కోట్లు కేటాయించారు.లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని 2018 ఎన్నికల్లో హామి ఇచ్చారు.ఈ నిధులతో రైతుల రుణాలు మాఫీ కావు.ఇప్పటికే అనేక జిల్లాల్లో రైతులు డిఫాల్టర్లుగా మారారు.కావున ఏకకాలంలో రుణమాఫీ నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.రైతుబంధుకు రూ.15,075 కోట్లు,రైతుబీమాకు రూ.1,589 కోట్లు కేటాయింపు చూపారు.ఈ 3 పద్దుల మొత్తం రూ. 23,049 కోట్లకు చేరుకుంది.ఇక మిగిలింది.రూ.3,332 కోట్లు మాత్రమే.ఈ బడ్జెట్లో పరిశోధనలకుగాని, ప్రకృతివైపరీత్యాల పరిహారం చెల్లింపుకుగాని, హార్టికల్చర్ అభివృద్దికిగాని పెద్దగా కేటాయింపులు లేవు.అయిల్ ఫామ్ తోటల పేంపుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి లక్షల ఎకరాలలో వేయిస్తామని,రైతులకు 50 శాతం నుండి 90 శాతం రాయితీ ఇస్తామని ప్రకటన చేసి దానికి తగిన నిధులు కేటాయించలేదని అన్నారు.రైతు బీమాను 18-59 నుండి 18-70 సంవత్సరాలకు వరకు పెంచాలని రైతు సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేశాయి.కౌలు రైతులకు ఏ పథకం ప్రకటించలేదని వారికి కూడా పథకాలు ప్రకటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలోరైతు సంఘం మండల కార్యదర్శి నక్క యాకయ్య ఎండి శంషుద్దీన్, దొంతూరి రాజు ఎర్ర రవి ఆకుల సారంగం వేల్పుల చిన్న రాములు తాటికాయల కుమార్ ఆకుల బలరాములు తదితరులు పాల్గొన్నారు.