మునగాల మండల పరిధిలో ని నరసింహ పురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ రమాదేవి దంపతులు మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇలా తమ వివాహ వేడుకలు నిడారంబరంగ.ఇలా అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులు మానసిక వికలాంగులు నిరాధారణకు గురైన అనాధల మధ్య వివాహ వార్షికోత్సవ జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ఇలా ప్రతి ఒక్కరు తమ తమ కుటుంబాల్లో జరిగే వేడుకల సందర్భంగా ఇలా ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారికి కనీసం ఒక రోజైనా మంచి ఆహారాన్ని అందించిన వారమైతామని ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండి ఇలాంటి ఆశ్రమంలో ఉన్న వారికి అండగా నిలవాలని గత సంవత్సరం మా వివాహ వేడుకల సందర్భంగా నేను ఇచ్చిన పిలుపులో భాగంగా ఎంతోమంది దాతలు దాతృత్వంతో ముందుకు వచ్చి నెలలో 10 నుంచి 15 రోజులలో నిత్యం అన్నదానం చేసే విధంగా ముందుకు రావడం అలాగే వారికి వస్త్రాలు దుప్పట్లు ఇతరత్రా వస్తువులు అందించి వారికి అండగా నిలవడం ఎంతో శుభ పరిణామమని. ఈ ఆశ్రమంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చి ఇక్కడ ఉన్న వృద్ధులకు అండగా నిలవడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ పూలమ్మ తదితరులు పాల్గొన్నారు