
మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి
మహిళా సంక్షేమానికి పాటుపడిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాల కింద 13 కోట్ల 56 లక్షలు రూపాయలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 81 మందికి 40 లక్షల రూపాయల చెక్కులను, శ్రీనిధి పథకం ద్వారా 35 కోట్ల 80 లక్షల 49 వేల రూపాయల చెక్కుల పంపిణీ, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 113 మందికి ఒక కోటి 53 లక్షల 13 వేల 138 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఎక్కడ కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అని ఆయన తెలిపారు.మహిళలు వంటింటికే పరిమితం చేసిన గత పాలకులు… ప్రస్తుతం సీఎం కెసిఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో పాటు సమానంగా రాణించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.సీఎం కేసీఆర్ మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు అని ఆయన గుర్తు చేశారు.ఆడబిడ్డ పెళ్లి కి సహాయం…పుట్టిన బిడ్డ నుండి ఇంటికీ చేర్చేవరకు దేశంలో మహిళలకు ఎక్కడ లేని విధంగా తెలంగాణాలో పథకాలు అమలు అవుతున్నాయి అని ఆయన అన్నారు.మహిళలూ తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు…నేలమీద నుండి అంతరిక్షంలోకి వెళ్ళేదాకా మహిళాలదే ఆధిపత్యం నడుస్తుంది అని ఆయన అన్నారు.అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికి ఆదర్శం అని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు.అభివృద్ధి లో, సంక్షేమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని అని అన్నారు.పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం టిఆర్ఎస్ ఆయన అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. పుట్టుక నుండి వృద్ధాప్యం వరకు అనేక సంక్షేమ పథకాలను కెసిఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్నామని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.కరోనా కాలంలో ఉద్యోగులు చేసిన కృషి అంతా ఇంతా కాదు.ప్రతి శాఖలో మహిళలూ ఎంతగానో కష్టించి పనిచేశారు..ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అన్నారు. ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచింది దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే నని అన్నారు.. కష్టపడితే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచడం ద్వారా మరోసారి తన మాటలను రుజువు చేశారన్నారు.ప్రజారోగ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు.తెలంగాణలో రాష్టాన్ని వైద్య రంగం లో దేశంలో నే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అందరం కృషి చేద్దామన్నారు.మహిళలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని, ఎంతటి వారిపైనైన కఠిన చర్యలు తీసుకునేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చారని అన్నారు, మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని,మీ అందరి దీవెనలు కేసీఆర్ గారిపై బిఆరెస్ పార్టీపై ఉంచాలని ఆయన కోరారు. అనంతరం మహిళ ప్రజాప్రతినిధులను, ఉద్యోగస్తులను, ఉత్తమ మహిళలను, వారందరినీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు,అధికారులు,సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, అన్ని స్థాయిల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు