
మూడో విడత ఇందిరమ్మ కాలనీకి చాకలి ఐలమ్మ నగర్ గా నామకరణం
జనగామ పట్టణంలోని 3వ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గత ఐదు సంవత్సరాలు గా పోరాటం చేస్తున్న పోరాట కేంద్రానికి తెలంగాణ రైతన్న సాహిత పోరాట యోధురాలు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నగర్ గా నామకరణం చేసినట్లు సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు.
10-03-2023 శుక్రవారం రోజున పట్టణంలోని మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల జనరల్ బాడీ సమావేశం సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మోకు కనక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంగా ఇందులోనే నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని రెండువేల 2012 13 సంవత్సరంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చి స్థలం చూపించడం మరిచిందని ఇల్లు లేని వారిని సిపిఎం ఆధ్వర్యంలో గుర్తించి కొట్టాలి ఇచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అనేక దశలవారీగా పోరాటాలు నిర్వహించింది సిపిఎం పార్టీ అన్నారు. జనగామ పట్టణంలో ఇండస్థల కోసం పోరాటం నిర్వహిస్తున్న మూడో విడత ఇందిరమ్మ డబల్ బెడ్ రూమ్ కాలనీకి జనగామ జిల్లా వాసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాధించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య, బోట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి పొత్కనూరి ఉపేందర్ సుంచు విజేందర్ ఇందిరమ్మ ఇండ్ల సాధన కమిటీ అధ్యక్షులు కల్యాణ లింగం రామవత్ మీట్యా నాయక్ బాల్న వెంకట మల్లయ్య భాషాపాక విష్ణు ఎర్ర రజిత ముషిపట్ల జయ యం డి గౌసియ పొన్నాల ఉమ దామెర అబ్రహం లింకన్ ఎనుగుల కమల మల్లమ్మ కొన్నే శాంత రమా మల్లేష్ తులసి పద్మ తదితరులు పాల్గొన్నారు.