
మహిళా శక్తితో పెట్టుకుంటే బీజేపీ కి పుట్టగతులుండవ్
కోదాడ పట్టణ పరిధిలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళన చేపట్టి కదంతొక్కిన మహిళలు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న అన్యాయాలను ఎదురిస్తే కేసులు పెడతారా ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన తాము బయపడేది లేదు అని బీజేపీతో ఏదైనా తేల్చుకోవడానికి బీ ఆర్ ఎస్ సిద్ధంగా ఉందని ఈడీ ఏమి చేసేది బీజేపీ నేతలకు ముందే ఎలా తెలుస్తుంది బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలన్నీ కీలు బొమ్మలుగా మారాయని ఉద్యమ చరిత్ర కలిగి సుదీర్ఘ కాలం పాటు అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యనేత కడుపున పుట్టిన మా కల్వకుంట్ల కవిత పై మరోసారి అవాకులు చవాకులు పేలితే మేము కన్నెర్ర చేస్తే ఆ మంటల్లో మాడి మసవడం ఖాయమని, గర్వంతో మాట్లాడితే కేంద్రంలో బీజేపీని గద్దె దించడం ఖాయమని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కేంద్రంలో బిజెపి మంత్రులు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తూ దేశాన్ని దోచుకుంటున్నారని బిఆర్.ఎస్ పార్టీని స్థాపించి జాతీయస్థాయిలో ఎదుగుతున్న కెసిఆర్ కూతురైన ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు బనాయించారన్నారు. దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా మార్చారని ధ్వజమెత్తారు.బి.ఆర్.ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మందలపు కృష్ణకుమారి శేషు, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, వార్డు కౌన్సిలర్ మేధర లలిత, వైస్ ఎంపీపీ మల్లెల రాణి,పట్టణ మహిళా అధ్యక్షురాలు రోజా రమణి,పట్టణ యూత్ అధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్,pacs చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, గంధం పాండు,సత్యవతి, సైదాబీ, ఉపేందర్,అభిధర్ నాయుడు,మండల, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు