
విద్యార్థులు పరీక్షల పట్ల భయం వీడాలి
విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ వ్యక్తిత్వ వికాస నిపుణులు చారుగండ్ల రాజశేఖర్ లు పేర్కొన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బాలుర హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు జరగబోవు పబ్లిక్ పరీక్షల పట్ల ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. పదవ తరగతి పరీక్షల్లో11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్ష నిర్వహిస్తున్నందున పరీక్ష విధానం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే విజయం మీ సొంతం అవుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జరగనున్న పదవ తరగతి ఫలితాల్లో అధిక శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.అనంతరంపాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు రాజారావు, రామకృష్ణ, బిక్షం తదితరులు పాల్గొన్నారు.