ఆపన్నులను ఆదుకోవడంలోనే కాదు… ఇతరులకు సాయం చేయడంలోనే కాదు… వ్యవసాయం చేయడంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు తానే సాటి. నిత్యం ప్రజాసేవ, అధికారిక కార్యక్రమాలు, అనేకానేక పనులు, రాజకీయ వ్యవహారాలు, సమీక్షలు, సమావేశాలు… ఇలా ఎప్పుడూ బిజీగా గడిపే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖాళీ సమయం దొరికితే చాలు తన వ్యవసాయ క్షేత్రానికి వెళుతుంటారు. అక్కడ వేసిన పంటలను చూసి తన్మయం చెందుతుంటారు. అప్పుడప్పుడు తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పంటలను పరిశీలించి పర్యవేక్షిస్తుంటారు. అలా వివిధ కార్యక్రమాలలో భాగంగా బిజీగా పర్వతగిరి లో గడిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం సాయంత్రం సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పొలం గట్లపై నడుస్తూ తన వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం కలియ తిరిగారు. పంటలను పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి పొలం గట్లపై వేగంగా నడుస్తూ అందరిని ఆశ్చర్య పరిచారు.