—ఆవాజ్
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాపియన్‌షిప్‌లో ప్రత్యర్థులతో దీటైనా పోటీని ఎదుర్కొని పంచ్పవర్తో అద్భుత ప్రతిభను కనపరచి పసిడి పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్‌కు ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నది. దేశం తరుపున మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నది.
నిజామాబాదుకు చెందిన నిఖత్ విజయం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు భారతదేశానికే గర్వకారణం. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నికత్ జరీన్ ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగడం హర్షనీయం. నిఖత్ ఎదుగుదలకు చేయూత నిచ్చిన కుటుంబానికి అభినందనలు. భవిష్యత్‌లో నికత్ ఇంకా ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి దేశ పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షిస్తున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి, వారికి అవసరమైన శిక్షణనిచ్చి క్రీడారంగంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆవాజ్ కోరుతున్నది.