
ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు
1944 ఏప్రిల్ 14న ముంబయి విక్టోరియా డాక్ యార్డ్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణం గా సుమారు 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది చనిపోయారు. వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక సేవల శాఖ నిర్వహించడం జరుగుతుంది.
ఈ వారోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంత్రం 04:00 గంటలకు గౌరవ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారిచే కరపత్రాలు మరియు గోడప్రతుల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
అలాగే 14న అగ్నిమాపక కేంద్రం లో శ్రీమతి రజిని కుమారి గారు కార్యనిర్వాహణాధికారి, సోమేశ్వర దేవస్థానం, పాలకుర్తి గారిచే " అగ్నిమాపాక పరికరాల ప్రదర్శనశాల " ప్రారంభోత్సవం జరిగింది.
తదనంతరం కామోమేరేషన్ పెరడ్ మరియు మౌనంపాటించే కార్యక్రమం జరిగింది.
కావున మిత్రులు ఈ అగ్నిమాపక వారోత్సవాలకు తగిన కవరేజి అందించగలరని, విషయాలు ప్రజలలోకి తీసుకెళ్లగలరని కోరుకుంటున్నాను.
కార్యక్రమాల షెడ్యూల్ అందించబడును మరియు ఆతిద్యం అందుకోగలరు.