మత సామరస్యానికి ప్రతీక రంజాన్
Jangaonకాంగ్రెస్ భవన్ – 17-04-2023..
మత సామరస్యానికి ప్రతీక రంజాన్…జక్రియా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ జనాబ్ ఖుస్రూ పాషా..
పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు హన్మకొండ రాయపురలోని జక్రియా ఫంక్షన్ హాల్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ జనాబ్ ఖుస్రూ పాషా మాట్లాడుతూ…
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఓ పండుగ వాతావరణంలా జరుపుకునే అత్యంత పవిత్రమాసం మాహే రంజాన్.
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉంటారని, అల్లా అందరిని చల్లగా చూడాలని, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు.
ఉపవాస దీక్ష (రోజా), నమాజ్, జకాత్లు ఆచరించే అవకాశం రంజాన్ మాసంలోనే ప్రాప్తిస్తున్నందున ముస్లింలు ఈ రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారాని అన్నారు.
ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు.
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
ఇప్పటి వరకు 18 మార్లు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సంవత్సరం సొంతంగా ఇఫ్తార్ పార్టీ ని ఏర్పాటు చేయడం చాల సంతోషంగా ఉందని కావున పార్టీలకు అతీతంగా ముస్లింలు ఇఫ్తార్ పార్టీ లో పాల్గొంటారని అన్నారు.
ఈరోజు మీరందరు పిలవగానే ఈ ఇఫ్తార్ విందుకు హాజరైనందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మరియు చాల సంతోషం.
ఆ అల్లా దయతో అందరు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను
అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను…
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ జనాబ్ ఖుస్రూ పాషా, మౌలానా ఫసిఉద్దిన్, నవీద్ బాబా, ఉబేద్ బాబా, సైలాని బాబా, కమాల్ పాషా, టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ కన్వినర్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైని, మగ్ధూం, వర్ధన్నపేట నియోజకవర్గ బాద్యులు నమిండ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహమ్మద్ ఇస్మాయిల్ శంషి, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్లు మహమ్మద్ అయూబ్, మిర్జా అజీజుల్లా బేగ్, టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి మొహమ్మద్ ముస్తాక్ నేహాల్, మొహమ్మద్ జాఫర్, AISF నాయకుడు సయ్యద్ వలి ఉల్లా ఖాద్రీ, ఎస్ కే అమర్, ఖాజా మొయినుద్దీన్, మొహమ్మద్ నసీర్, మొహమ్మద్ అంకుష్, మస్జిద్ కమిటీ సబ్యులు ముస్లిం మత పెద్దలు మస్జిద్ కమిటీ సబ్యులు కాకతీయ యూనివర్సిటీ JAC నాయకులు తదితరులు పాల్గొన్నారు.