
*జనగామ జిల్లాలోని ప్రైవేటు ఫర్టిలైజర్స్ మరియు సీడ్స్ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్న తెలంగాణ రైతు సంఘం నాయకులు*———————–జనగామ:*జనగామ జిల్లాలోని ప్రైవేటు ఫర్టిలైజర్ సీడ్స్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని జనగామ జిల్లా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ డిమాండ్ చేశారు**సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ శివలింగయ్య గారికి అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ*………. ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కనీసం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్తున్నారు కానీ ప్రైవేటు ఫర్టిలైజర్ సీడ్స్ వ్యాపారస్తులు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న అన్ని రకాల ధాన్యం ఇతర విత్తనాలు మరియు మరికొన్ని డొల్ల కంపెనీల విత్తనాలు విక్రయిస్తున్నారు త ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో విత్తనం బాగాలేదు ఈ విత్తనం ఎక్కడ తీసుకున్నారు అని ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ప్రైవేటు ఫర్టిలైజర్స్ సీడ్స్ షాపులలో ఎన్ని రకాల విత్తనాలు విక్రయిస్తున్నారో వాటి ధరలు వివరాల పట్టిక ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఎన్ని రకాల కంపెనీల ఎరువులు అమ్ముతున్నారు వాటి నిల్వలు ఎంత మేరకున్నాయి వాటి ధరల పట్టిక ఏర్పాటు చేయాలని వానకాలం సీజన్ సమీపిస్తున్నందున నాణ్యమైన విత్తనాలు ఎరువులు కొరతలు లేకుండా అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జనగామ జేకేఎస్ లో 201, 202,1006 వంటి ఒక్క పోస రెండు పొసలు వంగడాలు మంచి దిగుబడి వస్తుందని ప్రైవేటు వ్యాపారస్తులు రైతులను నమ్మబలికి విక్రయిస్తున్నారని కానీ వీరు అమ్ముతున్నటువంటి వరి ధాన్యం గింజలు నీలిరంగులో ఉండటం వల్ల వ్యాపారస్తులు కొనుగోలు చేయడం లేదు ఇటువంటి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని ఐకెపి కేంద్రాలను తక్షణమే ప్రారంభిచాలని ట్రాన్స్పోర్ట్ గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని తరుగు తాల్ పేరుతో రైతుల ధాన్యంలో కోతలు చేయకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య కోయల్ కార్ సాయి ప్రకాష్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు