
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం తల్లాడలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. తల్లాడ పట్టణానికి చెందిన షేక్. అహ్మద్ గారి జ్ఞాపకార్థం ఆయన కుమారులు, కూతురు 1.50 లక్షలతో అందించిన 350 రంజాన్ తోఫా ప్యాకెట్లను ఆయన సతీమణి షేక్. బీజాన్ బీ గారి చేతులమీదుగా పంపిణీచేశారు. తల్లాడ, ఎన్టీఆర్ నగర్ కాలనీ, నారాయణపురం, మల్లవరం గ్రామాల్లోని ముస్లింలకు వీటిని అందించారు. ఈ సందర్భంగా బీజాన్ బీ గారు మాట్లాడుతూ తన భర్త జ్ఞాపకార్థం ప్రతి ఏటా తల్లాడలో ముస్లింలకు వీటిని పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా ఏడాది కూడా అందించామని తెలిపారు. గత ఏడాది 250 ప్యాకెట్లు ఇస్తే ఈ ఏడాది ఆదనంగా మరో 100 కలిపి 350 పంపిణీ చేసినట్లు తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో అహ్మద్ గారి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుమారులు షేక్. అక్బర్, బహదూర్, బహర్లి, ఖదీర్, కూతురు నస్రీన్, మనవళ్లు, మనవరాల్లుతో పాటు మండల కోఆప్షన్ సభ్యులు షేక్. ఈసూబ్, ముస్లిం మత పెద్దలు గాలిబ్, మదార్, అన్వర్, జానీ, బాబు, తదితరులు పాల్గొన్నారు.