పూలే అంబేడ్కర్ జాతర కరపత్రం ఆవిష్కరణ
Nalgondaఏప్రిల్ 20,2023
Table of Contents
Toggleనల్లగొండ/క్లాక్ టవర్
పూలే అంబేడ్కర్ జాతర కరపత్రం ఆవిష్కరణ..
జయప్రదానికై పిలుపునిచ్చిన కెవిపిఎస్, ప్రజా సంఘాలు
ఏప్రిల్ మాసంలో భారతదేశ సామాజిక విప్లవకారులైన పూలే అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సమాజంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఏప్రిల్ 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎస్ బి ఆర్ గార్డెన్ లో పూలే అంబేడ్కర్ జాతరను నిర్వహించడం జరుగుతుందని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.
గురువారం నల్లగొండ పట్టణంలోని స్థానిక పూలే విగ్రహం దగ్గర పూలే అంబేడ్కర్ జాతరకు సంబంధించిన కరపత్రాన్ని కెవిపిఎస్ మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి భారత రాజ్యాంగాన్ని అంచలంచెలుగా విధ్వంసం చేస్తుందని,పూలే అంబేడ్కర్ ఆలోచనలకు తూట్లు పొడుస్తున్నారని వారు అన్నారు.ఈ దేశంలో సామాజిక చైతన్యాన్ని కి నాంది పలికి దళిత బహుజన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించి స్త్రీ విద్యా వ్యాప్తికై అహర్నిశలు కృషి చేసిన మహనీయులను వారి ఆలోచనలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంపై ఉందన్నారు.ఈ పాలకులు ప్రజాస్వామ్యం పేరుతో అంతర్గతమైన నియంతృత్వ విధానాలను అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్న గొంతుకులను భౌతికంగా నిర్మూలిస్తున్నారని వారన్నారు. భారతదేశంలో రోజు రోజుకీ దళిత బహుజన వర్గాల మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఆశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నారని ఇది అనాగరికమైన చర్య అని వారన్నారు. శాస్త్రీయమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ విద్యా వ్యాప్తికై కుల వివక్షతలు లేని వర్గ వివక్షతలు లేని సమసమాజ స్థాపనకై పూలే అంబేడ్కర్ నారాయణ గురు పెరియర్ రామస్వామి నాయకర్ లాంటి ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి ఏప్రిల్ 28న నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సామాజిక దళిత బహుజన కళారూపాలతో నిర్వహించే పూలే అంబేడ్కర్ జాతరకు మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు ప్రజాస్వామ్యవాదులు బుద్ధి జీవులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయవలిసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న, రజక సంఘం జిల్లా కార్యదర్శి చెరుకు పెద్దులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోహన్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్, మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, దళిత బహుజన కూలి రైతు సంఘం బాధ్యులు కె.పర్వతాలు,పి.వై.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్,మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్, చుక్కా సైదులు,మాల మహానాడు నాయకులు రేఖల సైదులు, కత్తుల జగన్ కత్తుల షణ్ముఖ ,తదితరులు పాల్గొన్నారు.