
-ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాపర్తి రాజు
— కలెక్టర్ గారికి ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన నాయకులు~~
జనగామ: ఐకేపీ ధాన్యపు కొనుగోలు కేంద్రాలలో హమాలి కార్మికుల కోసం అమాలి రేట్ల పట్టిక ప్రభుత్వం ఏర్పాటు చేసి అమలు చేయాలని తాడు మాములు ఇవ్వాలని కోరుతూ ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు దాని యొక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఈ కేంద్రాలలో హమాలి కార్మికులు ఎండ వాన అనకుండా శ్రమ చేస్తున్నారని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే హమాలి కార్మికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సమంజసం కాదన్నారు కొనుగోలు కేంద్రాలలో హమాలి రేట్లు క్వింటానుకు 55 రూపాయలు ప్రభుత్వమే నిర్ణయించి నిర్ణయించిన ప్రకారం డబ్బులు ప్రభుత్వమే చెల్లించాలని రైతుల నుండి వసూలు చేయకూడదని డిమాండ్ చేశారు ఐకేపి కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని హమాలి కార్మికులకు రెండు జతల బట్టలుయూనిఫామ్స్ చెప్పులు ఇవ్వాలని అన్నారు
తాడుమామలు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అన్నారు 50 సంవత్సరాలు దాటిన హమాలి కార్మికులకు నెలకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరారు ఈ క్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజేందర్ హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు అపరాధపురాజు రాష్ట్ర కమిటీ సభ్యులు బైరగోని బాలరాజు గౌడ్ యూనియన్ జిల్లా నాయకులు అన్నెబోయిన రాజు పండుగ రాజారాం మద్దూరి యాదగిరి శ్రీరాముల శ్రీనివాస్ కొన్నే రవీందర్ తదిరులు పాల్గొన్నారు