
స్టేషన్ ఘనపూర్/రఘునాథ్ పల్లి ఏప్రిల్ 23
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలం ఖిలషాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ పార్టీ యూత్ అధ్యక్షడు మేడే అశోక్ కు ఇటీవల ఆక్సిడెంట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ రఘునాథపల్లి మండల అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్ విషయం తెలుసుకొని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశానుసారం వారికి 5 వేలు ఆర్ధిక సహాయం చేసి,పరామర్శించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కావాటి యాదగిరి,జిల్లా నాయకులు కావాటి రాజయ్య యాదవ్, జనగామ మార్కెట్ డైరెక్టర్ శివరాత్రి రాజు, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ శగా సురేష్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు గౌస్,ఎస్ సెల్ మండల నాయకులు సంపత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.