
హనుమకొండ: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవిలో ప్రవేటు క్లాసులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి, జిల్లా నాయకులు మాటూరు సతీష్ లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వేసవిలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక లు చేసిన, దానికి విరుద్ధంగా హనుమకొండలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలు, స్కూల్స్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి, విద్యార్థుల మానసిక ప్రశాంతత కోసం సెలవులు అవసరం ఉన్నప్పటికీ, ర్యాంకుల కోసం ఫీజుల కోసం విద్యార్థులను ప్రైవేటు విద్యాసంస్థలు మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నాయి, విద్యార్థులకు మానసికమైన ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి, వేసవిలో తరగతులు నిర్వహిస్తే అధిక ఫీజులు దోచుకోవాలనే దురుద్దేశంతోనే ప్రైవేటు విద్యాసంస్థల కుట్ర పడుతున్నాయి, కోచింగ్, స్పెషల్ క్లాస్ ల పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.