గణపురం మండలం :
చెల్పూర్ గ్రామం.
తేదీ : 14/05/2023 – ఆదివారం.
చెల్పూర్ గ్రామంలో చిరుధాన్యాల ప్రాసెసింగ్ సెంటర్ ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు,జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జక్కు శ్రీహర్షిని గారు, జిల్లా కాలెక్టర్ భావేశ్ మిశ్రా గారు, అడిషనల్ కాలెక్టర్ దివాకర్ గారు…
చిరుధాన్యాల ద్వారా వివిధ రకాల పోషక వంటల ఉత్పత్తి పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు, వారి జీవనశైలి మళ్లీ మొదలవుతుందని అన్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణాలను ఆరోగ్య సంస్థ వారు సేకరించిన మీదట మనం తీసుకునే ఆహారమే మూలమని, దానిలో చిరుధాన్యాలు చాలా ముఖ్యమని వారి అధ్యాయంలో తేలిందన్నారు. దానిలో భాగంగానే 2023 సంవత్సరాన్ని WHO చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాల వాడకం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఆడపిల్ల ప్రసవం అంటే ఎంతో భయపడే పరిస్థితులు ఆనాడు ఉండేవి.. కానీ ఇప్పుడు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా అంగన్వాడీ టీచర్లు కృషి మరువలేనిది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల్లీ-బిడ్డల సంక్షేమానికి అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆడపిల్లలకు పెళ్లి దగ్గర నుండి పిల్లల్ని కనడం, వారిని పెంచడం వరకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి. దేశం మొత్తంలో ధనికులు, ప్రభుత్వ అధికారుల మొదలుకొని పేదవారికి వరకు అత్యధికమైన ప్రసవాలు నేడు ప్రభుత్వ దవాఖానలో జరుగుతుండటం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ పోషణ పక్షం సంవత్సరం సందర్భంగా తల్లులందరికి నా శుభాకాంక్షలు అన్నారు.
మథర్స్ డే సందర్భంగా జిల్లాలో ఎలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా శాంతోషకరమైన విషయమని అన్నారు.
మహిళ సంఘాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న వె నిర్ణయం పట్ల గౌ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ రహదారి పక్కనే ఉన్నందున రోడ్డుకు స్టాల్ లు ఏర్పాటు చేయాలని కోరారు. మరిన్ని నిధులను కేటాయించి అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.