భారాస గూండాల దాడి హేయమైన చర్య:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
Uncategorizedఅడ్వకేట్ యుగేందర్ పై భారాస గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం రాత్రి సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఅడ్వకేట్ యుగేందర్ ను పరామర్శించారు. భారాస ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశానికి వెళ్తున్న దాడి చేయడం హేయమైన చర్యగా మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే భూ దందాలు,ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు దాడి జరిగిందని తెలిపారు. భారాస మంత్రి, ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సర్కారు స్పందించి దాడికి సూత్రదారి తుంగతుర్తి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఇలాంటి హత్యయత్నం, భౌతిక దాడులను బీఎస్పీ సహించదని హెచ్చరించారు. ఎమ్మెల్యే భూ దందాలు,ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో జిల్లా రెవిన్యూ, పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పధకం ప్రకారమే భారాస గూండాలు దాడి చేశారని ఆరోపించారు.కారుపై రాళ్ల దాడి జరిపి, హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కారును ఎందుకు అడ్డగించారని అడిగే లోపే తన వాహనంపై భారస గుండాలు దాడి చేశారని యుగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.భౌతిక దాడులు,హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిపై దాడుల వెనుక జిల్లా మంత్రి జి.జగదీశ్ రెడ్డి,కేటీఆర్,కేసీఆర్ ఉన్నారన్న ఆయన వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించారు.తుంగతుర్తిలో ఫ్యాక్షన్ రాజకీయాలు,అధికార పార్టీ నేతల అరాచకానికి అడ్టుకట్ట వేస్తామని అన్నారు.అడ్వకేట్ పై హత్యయత్నానాన్ని రాష్ట్ర బార్ అసోసియేషన్ ఖండించాలసిందిగా కోరారు. తుంగతుర్తిలో అరాచకం పాలన అన్నారు.దాడికి పాల్పడిన భారాస గూండాల తీరుపై ఆదివారం బీఎస్పీ ఆధ్వర్యంలో తుంగతుర్తి బందుకు పిలపిస్తున్నట్లు తెలిపారు.బందుకు ప్రజాస్వామ్యవాదులు మద్దతు ఇవ్వాలని కోరారు.