విజయ డెయిరీ ఎదుట పాడి రైతుల ధర్నా
Hyderabadవిజయ డెయిరీ పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ పాడి రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లాలాగూడలోని విజయ డెయిరీ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ధర్నాకు మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25.82 లక్షల కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. పొడి రైతులకు పెట్టుబడి, పశుపోషణ, దాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచడానికి పాడి రైతులను ప్రొత్సహించటానికి లీటర్కు రూ.4 ఇన్సెంటివ్ (ప్రోత్సాహం) ఇస్తామని 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. 2016 సంవత్సరం వరకు 15 రోజులకోసారి విల్లుతో కలిపి పాడి రైతులకు ప్రోత్సాహం ఇచ్చారు. 2016 సంవత్సరం నుండి పాడి రైతులకు వారి బ్యాంక్ ఖాతాలోకి నెలకోసారి జమ కాలేదు. రైతులందరు నిరసన తెలిపితే 2016 నుండి 2020 డిసెంబర్ వరకు కొంతమందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలో వేశారు. ఎవరికీ ఎన్ని డబ్బులు వేశారనేది లిస్టు ఇవ్వడం లేదు. ఇప్పుడు 2021 జనవరి నుండి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవడం వలన గ్రామాలలో రైతులు ప్రైవేట్ డెయిరీలను ఆశ్రయిస్తున్నారు. విజయ డెయిరీకి వేలాది లీటర్లు పాలు ఇటీవల తగ్గాయి. పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహంను రూ.7 కు పెంచాలి. పాల బిల్లుతో చెల్లించాలి. కర్ణాటక, కేరళ తరహాలో సాంకేతిక సేవలు అందించాలి. పాడి పశువుల బీమా ఉచితంగా చేపట్టాలి. పాడి రైతులకు బీమా సౌకర్యం, ప్రమాదబీమాకు రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలి. రైతులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలి. 6. పాడి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. డెయిరీ నుండి వచ్చే లాభాలను రైతులకు పంచాలి. డెయిరీకి పర్మినెంట్ ఎండిని నియమించాలి. ఒకే ప్రదేశంలో ఎక్కువ సంవత్సరాల నుండి పని చేస్తున్న సిబ్బందిని ట్రాస్ఫర్ చేయాలి. అనంతరం విజయ డెయిరీ సంస్థ జనరల్ మేనేజర్ మల్లయ్య కి వినతిపత్రం అందజేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ పాడి రైతుల సంఘం కేంద్ర కమిటీ సభ్యులు మూడ్ శోభన్, పాడి రైతుల సంఘం రాష్ట్ర నాయకులు సాదం రమేష్, వీరమల్లు రాజయ్య, ఇమ్మడి శ్రీనివాస్, కసారపు ధర్మరెడ్డి, మన్యం నారాయణ, కురెళ్ళ శ్రీనివాస్, కోటగిరి నాగేశ్వర్ రావు, బోగ్గన వెంకటేష్, మాడపాటి రాజేష్, సుబ్బారావు, రాజ్ కుమార్, వెంకటస్వామి, సీఐటీయూ నాయకులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.