
గిరిజన విద్యార్థులను చదువులకు దూరం *చేసేందుకు కుట్ర
సెక్షన్ల పేరుతో ఇస్తున్న ఆర్డర్లను వెనక్కి తీసుకోవాలి విద్యార్థికి ఎక్కడ నచ్చితే అక్కడ చదువుకునే అవకాశం కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులని చదువులకు దూరం చేసేందుకు గిరిజన సంక్షేమ అధికారులు కుట్రలు పన్నుతున్నట్టుగా ఉందని అందుకే విద్యాహక్కు చట్టాన్ని సైతం తుంగలో తొక్కుతున్నట్టుగా వారి చర్యలు ఉన్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బయ్యా అభిమన్యు అన్నారు ఈ మేరకు ఇల్లందు పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో అనేక ప్రాంతంలో ఎంతోమంది మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యాసంస్థలని అందుబాటులో ఉంచుతూ అనేక ఆశ్రమ పాఠశాలను నెలకొల్పి వారు చదువులకు దూరం కాకుండా తల్లిదండ్రులకు దూరమవుతున్నామనే బాధ నుంచి మరిచిపోయి ఉన్నత చదువులు చదవాలని అక్కడే అక్కడి గిరిజనులకు విద్యాసంస్థలు అలవాటు పడడం కోసం సొంత ఊర్లలోనే చుట్టుపక్కల కొన్ని గ్రామాలని కలిపి చదువు , బోజనమ్ , వసతి ఏర్పాటు చేసి ఒక ఆశ్రమం పాఠశాల గా ఏర్పటు చేసి అపరిమిత సంఖ్య తోటి విద్యార్థులకి చదువులు నేర్పడం , గిరిజనుల లో అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే వాటికి భిన్నంగా ప్రస్తుతం జిల్లా అధికారులు అబ్బాయిలు ఒక్కో ఆశ్రమ పాఠశాలలో అయితే 50 మంది, అమ్మాయిలు అయితే 45 మంది ఒక్కో సెక్షన్ కి చదువుకోవాలని చెప్పి కుదింపు పెట్టి అక్కడ 45 కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి దగ్గర ఆ బడిలో ఒక సెక్షనే ఉంటే ఆ మిగిలినటువంటి విద్యార్థులని వేరే పాఠశాలలకు షిఫ్ట్ చేయమని చెప్పి గైడెన్స్ ఇస్తవు న్నారు , అలాగే కొన్ని పాఠశాలల కి 2 సెక్షన్లు ఇచ్చి సంఖ్య పెంచమని టార్గెట్ విధిస్తామన్నారు .ఇది సరైన చర్య కాదని ఇటువంటి చర్యవల్ల గిరిజన విద్యార్థులు ఉన్న ప్రాంతాన్ని వదిలి వెళ్ళలేక ఆ చదువుతున్నటువంటి తరగతి గదిని , పాఠశాలను దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లలేక చదువు మధ్యలోనే మానేసే ప్రమాదం ఉంది. అలాగే 45 కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులని షిఫ్ట్ చేయమని చెప్పడానికి ఏ కులమానాన్ని ప్రకారం షిఫ్ట్ చేస్తారో కూడా క్లారిటీ లేదు కాబట్టి కచ్చితంగా ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని ఇలాంటి ఆలోచనతో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలలో గతం గిరిజన విద్యా వ్యవస్థ పక్కకు తప్పిపోయిందని కాబట్టి ఇలాంటి చర్యను ఈ జిల్లాలో ఇంత పెద్ద ఐటీడీఏ వ్యవస్థలో పెట్టడం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి చర్యంగా దీని పరిగణిస్తా ఉన్నావని పాఠశాలలో ఎటువంటి ఆందోళన పోరాటాలు జరగకముందే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రాకముందే ఈ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం .లేని పక్షంలో విద్యార్థులలో ఏ విద్యార్థి అయినా తనకు నచ్చిన పాఠశాలలో విద్యాహక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు ఏ పాఠశాలలో సీట్ అడిగినా అక్కడ ప్రవేశం ఇవ్వాలి. అలా సీట్ ఇవ్వలేదని చెప్పి ఏ తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐగా కచ్చితంగా ఆ పాఠశాల ఎదుట ఆందోళన కార్యక్రమం చేస్తామని ఆ ఉద్యమాలకు జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఎస్ఎఫ్ఐ గా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తమ యొక్క అనుభవాన్ని రంగరించుకోవాలని గతంలో జరిగినటువంటి పొరపాట్లు కూడా చూసుకోవాలని ఇటువంటి చర్యల వల్ల జరిగే నష్టాలను ముందే అంచనా వేసుకోవాలని కూడా వారికి సూచన చేస్తా ఉన్నారూ .
గిరిజన విద్యార్థుల మీద ప్రయోగాలు మానాలని వారికి సూచన చేస్తున్నారు.