దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ ప్రభుత్వం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శనివారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ గిరిజనోత్సవం కార్యక్రమంలో భాగంగా చిలుకూరు మండలం దూదియా తండాలో ఏర్పాటు చేసిన గిరిజన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి, గిరిజన సంస్కృతిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ……..దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు.గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన అన్నారు.నేడు గిరిజనులు విద్యాధికులై ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు అని ఆయన తెలిపారు.గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు పాటుపడుతున్నదని అన్నారు.తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజనులకు రాజ్యాధికారంలో కీలక భాగస్వామ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌గా పిలుచుకుంటున్న ప్రాంతంలో మూడు శతాబ్దాల క్రితమే సేవాలాల్ మహారాజ్ నడయాడారని,అదే బంజారాహిల్స్ నేలమీద వారి పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవిస్తే అణగారిన వర్గాల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు, ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వారు దేశానికి కీర్తి తెచ్చే దిశగా ఎదుగుతున్నారని, ఈ దిశగా సీఎం కృషి ఎనలేనిదని వారు అభివర్ణించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతోనే బంజారా భవన్‌ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని ఆయన తెలిపారు. సేవాలాల్ మహారాజ్ అయితే మన జాతి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి బాగుండాలని కోరుకుంటే దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అనేక సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు సంఘాల పేరుతో రాజ్య పరిపాలన గ్రామపంచాయతీ కావాలి మరి ఎక్కడ ఊరికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలకు అనుబంధంగా ఉండకూడదు మా తండాలో మేము అభివృద్ధి చేసుకోవాలని ఒక నినాదం చేస్తూ అనేక పోరాటాలు చేయడం జరిగింది అని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3600 గ్రామాలను గ్రామ పంచాయతీల చేసి మన తండాలో మనమే పరిపాలించుకునేందుకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన మార్గనిర్దేశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కోటి రూపాయల నిధులు ఖర్చు చేసి ఆయా మండలాల్లో నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం ఈ పండుగను ఆలోచన చేయడం అనేది చాలా గొప్ప ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టి మన ప్రభుత్వాన్ని మనమందరం కూడా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.గిరిజనులంతా ఐకమత్యంతో మెలిగి పార్టీలకు అతీతంగా కృషి, పట్టుదలతో పరస్పర సమన్వయంతో పనిచేసి కోదాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఆశా వర్కర్లను , మహిళా సంఘాల ప్రతినిధులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు చీర-సారె తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండా సైదయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, దొడ్డ సురేష్ బాబు, జెడ్పి కోఆప్షన్ సభ్యులు జానీ మియా,మాజీ జెడ్పిటిసి భట్టు శివాజీ నాయక్, గ్రామ సర్పంచులు బాణావత్ నందులాల్ , మంగమ్మ సైదులు, వాలి వెంకన్న, శంకర్, రవీందర్,ఉపేందర్, చిన్న రాములు, ఎంపీటీసీ కృష్ణ చైతన్య, రమణ నాగయ్య, సొసైటీ చైర్మన్లు అలసగాని జనార్ధన్, భాష్యం సైదులు, మండల బీఆర్ఎస్ నాయకుల, తాళ్లూరు శ్రీనివాస్, అక్కినపల్లి జానకి రామాచారి, ఉపేందర్, బాదే ఆంజనేయులు, వెంకన్న,, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షులు బుక్య సక్రాం,బోడ శీను, శంకర్ నాయక్, రాములు,బట్టు వెంకటేశ్వర్లు, రామాచారి, వాసు, గన్న అశోక్, ఆయా తండాల గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.