
-మిశ్రీన్ సుల్తానా SFI హనంకొండ జిల్లా అధ్యక్షురాలు.
హనుమకొండ-పెట్రోల్ పంప్:
భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హనుమకొండ జిల్లా కమిటీ
ఈరోజు హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాలను తెలుసుకుంటూ, రావాల్సినటువంటి యూనిఫాంలో పాఠ్యపుస్తకాలు నోటి పుస్తకాలు వాటి వివరాలు సేకరించడం చేస్తూ సర్వే నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు మిశ్రీన్ సుల్తానా విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభించి దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికీ పుస్తకాలు అన్ని అందించకుండా మన ఊరు మనబడి కార్యక్రమాల పేరుతో పాఠశాలలో కొత్త నిర్మాణాలు సగంలోనే చేసి ఆపివేయడం జరిగింది. నోటు పుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నుండి అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ జిల్లా వ్యాప్తంగా కనీసం 10 పాఠశాలలో కూడా పూర్తిగా నోటికి పుస్తకాలు ఇవ్వలేదు, అంతేకాకుండా తాగునీటి వ్యవస్థ ఏ పాఠశాలలో కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. విద్యార్థులందరికీ సరిపడా వాష్రూమ్స్ లేవని మరియు స్కావెంజర్ పోస్టులను ఇంకా భర్తీ చేయలేదని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కంప్యూటర్ విద్య తప్పనిసరి అవసరమని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కృషి చేయట్లేదని విద్యార్థులతో తెలియజేశారు. అంతేకాకుండా విద్యార్థుల మానసిక శారీరక పెరుగుదల కోసం క్రీడలు తప్పనిసరి అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ కిట్ కి సంబంధించినటువంటి నిధులు కేటాయించటంలేదని అది కాకుండా అమ్మాయిలకు ప్రత్యేకంగా వారి వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన కిట్లను కూడా కేటాయించడం లేదని తెలియజేశారు. విద్యార్థులతో మాట్లాడిన అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం జరిగింది.