
ఆంధ్రప్రదేశ్ ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనంతపురం టౌన్ రుద్రంపేట పంచాయతీ అజయ్ ఘోష్ కాలనీలో29/06/2023 వ తేదీ గురువారం ఆషాడ మాసం తొలి ఏకాదశి రోజున ఎరుకల ఆరాధ్య దైవము ఎరుకల జాతి మూలపురుషుడు శ్రీ ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది
అనంతపురంజిల్లా మహిళా అధ్యక్షురాలు గుజ్జల ముత్యాలమ్మ గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సాకే చిరంజీవి గారు విచ్చేసి ఏకలవ్య మహారాజు గారి చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేసి కేక్ కట్ చేసి ఘనంగా జరపడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు సాకే చిరంజీవి గారు మాట్లాడుతూ విలువిద్యలో సాటిలేని వీరుడు మాట తప్పని మడమ తిప్పని యోధుడు మనువాద కుట్రలకు బలైన ఎరుకల జాతి ముద్దుబిడ్డ గురువు లేకుండానే విద్య నేర్చుకుని గురుదక్షిణగా బొటనవేలును త్రున ప్రాణంగా గురువుగారికి ఇచ్చిన మేటి వీరుడు మనసున్న ఎరుకల వీరుడు శ్రీకృష్ణుని మాటలకు బలైన యుగపురుషుడు శ్రీ ఏకలవ్య మహారాజు ఎరుకల జాతి తరతరాలకు కీర్తి పతాకాన్ని నిలిపిన ధీరుడు శ్రీ ఏకలవ్య మహారాజ్ గారి జయంతి వేడుకలుఘనంగా జరుపుకోవడం ఎరుకల జాతి చేసుకున్న పుణ్యమని ఆయన స్మృతించుకుంటూ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలోఅనంతపురం జిల్లా అధ్యక్షులు సాకే గోవింద్ గారు, మరియు ప్రధాన కార్యదర్శి సాకే సుంకన్న గారు, మరియు జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే ముత్యాలమ్మ గారు, సత్యసాయి జిల్లా అధ్యక్షులు బిజీలి గంగులప్పా గారు, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ముసాలయ్య గారు,అనంతపురం జిల్లా కార్యదర్శి సాకే నాగార్జున గారు, సీనియర్ నాయకులు గుజ్జల ముత్యాలప్ప గారు , గుజ్జల శేఖర్ గారు,మరియు అలివేలమ్మ గారు, గుజ్జల మీనాక్షీ గారు, గుజ్జల ప్రమెలమ్మ గారు, కవిత గారు ఇతర నేతలు పాల్గొనీ ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది