
గళం న్యూస్ హైదరాబాద్ జూన్ 30 పినపాక ప్రభాకర్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్
సాయి చంద్ అతి పిన్న వయసులో ఆకస్మికంగా మరణించటం తెలంగాణ ప్రజలకు తీరని లోటు. కమ్యూనిస్ట్ కుట్టుంబంలో జన్మించి, చిన్న తనం నుండే విప్లవ భావాలతో సమాజాన్ని చదివి , అరుణోదయ సాంస్కృతిక సమైక్య లో కళాకారుడిగా ప్రయాణం మొదలుపెట్టి, తెలంగాణ ఉద్యమానికి ఉపిరయ్యి, తన ఆట పాటలతో ప్రజలలో ఉద్యమ ఆకాంక్షను రగిలించిన ఒక గొప్ప కళాకారుడు సాయి. తెలంగాణ రాష్ట్రంలో గిడ్డంగుల శాఖా చైర్మన్ గా తన సేవలు అందిస్తూ, కళాకారుడిగా నిత్యం ప్రజలను చైతన్య పరుస్తూ ఉన్నారు. ఆయన మరణం మాతో పాటు తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు. ఆయన మా నుండి దూరమైనా ఆయన పాట ఈ భూ మండలం ఉన్నంత కాలం బతికే ఉంట్టుంది.. నేస్తాం అందుకో మా విప్లవ జోహార్లు