బురాన్ పురం గ్రామం, మరిపెడ మండలం పరిసరాల ప్రాంత ప్రజలకు శుక్రవారం శనివారం గ్రామీణ ప్రాంతం పైన తెలిపిన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో ప్రత్యేక ఆధార్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ ప్రత్యేక ఆధార్ శిబిరం కేంద్రంలో ఆధార్ డెమోగ్రాఫిక్ అప్డేట్ క్రింద పేరు, చిరునామా పుట్టిన తేదీ లింగము చారవాణి నెంబర్ ఈ- మెయిల్ బయోమెట్రిక్ అప్డేట్ క్రింద ఫోటో మార్పిడి చేతి వేలిముద్రలు తీసుకోవడం, ఐరిస్ స్కాన్ కొత్త ఆధార్ కార్డు ఐదు సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలకు ఉచితంగా ఆధార్ కార్డు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కావున బురాన్ పురం గ్రామం, మరిపెడ మండలం పరిసరాల ప్రాంత ప్రజలకు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని శ్రీ. ఎల్. సైదా నాయక్, తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు, మహబూబాబాద్ వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఆధార్ ప్రత్యేక శిబిరం విస్తృత ప్రచారం కొరకు లావూరి.సైదా. ఐ.పి, తొర్రూర్, వాసం. అనిల్ కుమార్, డీ.ఎస్. కిషన్, ఆధార్ ఆపరేటర్, జాటోత్. యాకూబ్. నాయక్, యస్.పి.యం, మరిపెడ, భానోత్.వెంకన్న, బి.పి.యం, బురాన్పూర్, డి. వినోద్ కుమార్, ఆధార్ ఆపరేటర్ మరిపెడ, జి. సుధాకర్, బి. ప్రశాంత్ మేల్ ఓవర్సీస్ గ్రామీణ ప్రజలు, తపాల సిబ్బంది తదితరులు పాల్గొన్నరు.